• Login / Register
  • KTR Promise | పిల్లల చదువుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తా

    KTR Promise | పిల్లల చదువుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తా
     నేతన్న కుటుంబానికి కేటీఆర్‌ భరోసా
    కొన్ని కుటుంబాలను మాత్ర‌మే ఆదుకుంటాను
    మిగితా కుటుంబాల‌ను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలి : కేటీఆర్‌
    Hyderabad|తెలంగాణ రాష్ట్రంలోని  సిరిసిల్ల నియోజ‌క వ‌ర్గంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న బైరి అమర్‌ దంపతులకు చెందిన‌ కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్ (BRS Working President) ప్రెసిడెంట్ కే రామారావు (KTR) పరామర్శించారు. ఈ మేర‌కు కేటీఆర్ ఆదివారం సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని, అక్క‌డి వెంకంపేటలోని భైరి అమర్, స్రవంతి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వారి ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున డిపాజిట్‌ చేయిస్తానని ప్ర‌క‌టిస్తూ.. ఈ మేర‌కు  ధైర్యంగా ఉండాలని, బాగా చదువుకోవాలని అమర్‌ పిల్లలకు కేటీఆర్ చెప్పారు. అమర్‌ పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడి వివ‌రాలు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల వరకు పరిహారాన్ని అందించ వలసిందిగా కోరారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్లలో ఇప్పటివరకు 20 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటు వల్ల మాత్రమే నేతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.
              సిరిసిల్ల నుంచి తాను ఎమ్మెల్యేగా ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిన‌ట్ల‌యితే తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టే విధంగా కక్షకు దిగ‌డం ఈ స‌ర్కారు అంత‌ మంచిది కాదని హితవు పలికారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మానవత్వంతో స్పందించాలని రిక్వెస్టు చేశారు. సిరిసిల్లకు న్యాయం చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. అయితే ఒక ఎమ్మెల్యేగా తాను సిరిసిల్లలో ఒక కుటుంబాన్ని లేదా కొన్ని కుటుంబాలను మాత్రమే ఆదుకోగలన‌ని, మిగితా అన్ని కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.
    *  *  *

    Leave A Comment